డేటా చోరీ కేసు : సంస్థలకు నోటీసులు

డేటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు పలు సంస్థలకు నోటీసులు జారీ చేశారు. మొత్తం పదకొండు సంస్థలకు నోటీసులు జారీ చేశారు

Update: 2023-04-03 02:45 GMT

డేటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు పలు సంస్థలకు నోటీసులు జారీ చేశారు. మొత్తం పదకొండు సంస్థలకు నోటీసులు జారీ చేశారు. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం లీకేజీపై ప్రముఖ సంస్థలను విచారించే పనిలో భాగంగా ఈ నోటీసులు జారీ చేశారు. వివిధ రకాల బ్యాంకులతో పాటు ఫైనాన్స్ సంస్థలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఓటీటీ, ఈ కామర్స్ వెబ్‌సైట్లు, ఈ లెర్నింగ్ సెంటర్లకు నోటీసులు జారీ అయ్యాయి.

వినియోగదారుల సమాచారాన్ని...
యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సి, టెక్‌ మహీంద్రా సంస్థతో పాటు అనేక కంపెనీల నుంచి డేటా చోరీకి గురయినట్లు గుర్తించిన పోలీసులు వీటితో పాటు బిగ్ బాస్కెట్, ఫోన్‌పే, ఫేస్‌బుక్, పాలసీబజార్, మ్యాట్రిక్స్, ఎస్‌బిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు కూడా నోటీసులు జారీ చేశారు. గోప్యంగా ఉంచాల్సిన వినియోగదారుల సమాచారాన్ని ఇతరులకు ఇవ్వడంపై సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా దృష్టి సారించారు.


Tags:    

Similar News