రాజా రెడ్డి అనుమానాస్పద మృతి

రాజా రెడ్డి రాజా ఫౌండేషన్ ను స్థాపించి ఎన్నో గొప్ప పనులు చేసుకుంటూ

Update: 2023-08-12 03:27 GMT

ప్రొద్దుటూరు పూజ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకులు, మైలవరం డాడీ హోమ్ నిర్వాహకులు రాజా రెడ్డి అనుమానస్పదంగా మృతి చెందారు. ఆయన ఒంటి పైన పలు గాయాలు ఉన్నాయి. ఆయన మరణం వెనుక ఎవరు ఉంటారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

రాజా రెడ్డి రాజా ఫౌండేషన్ ను స్థాపించి ఎన్నో గొప్ప పనులు చేసుకుంటూ వెళుతున్నారు. 2001లో 40 ఎకరాల భూమిలో ఆయన ఈ ఫౌండేషన్‌ను స్థాపించారు. 3 అంతస్తుల భవనంతో విశాలమైన క్యాంపస్‌ను నిర్మించారు. ఇప్పుడు డాడీ హోమ్‌ గా పిలవబడుతున్న ఈ ప్రాంతంలో 150 మంది పేద ప్రజలు ఉన్నారు. అనాథలు, వీధి పిల్లలు, HIV సోకిన పిల్లలు, పెద్దలు, అత్యాచార బాధితులు, మానసిక వికలాంగులు, వృద్ధులు ఇందులో భాగంగా ఉన్నారు. డాడీ హోమ్‌లో చాలా మందికి తాము ఒంటరి వాళ్ళము కామని.. అండగా రాజా రెడ్డి ఉన్నారని భావించే వాళ్లు. ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోవడం వాళ్లకు తీవ్ర విషాదాన్ని నింపింది.


Tags:    

Similar News