డ్యాన్స్ మాస్టర్ సురేష్ ఆత్మహత్య.. ఆ బాధే..!
పెద్దగా ఆదాయం లేకపోవడం.. పెళ్లి అవ్వడం లేదనే బాధ కారణంగా మద్యానికి బానిసయ్యాడు.
ఉరేసుకొని డ్యాన్స్‌మాస్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కోదాడ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొమరబండలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దార డ్యాన్స్‌మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అతడి వయసు 30 సంవత్సరాలు. పెద్దగా ఆదాయం లేకపోవడం.. పెళ్లి అవ్వడం లేదనే బాధ కారణంగా మద్యానికి బానిసయ్యాడు. వివాహం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. అతడి స్నేహితుడు ఇంటికి వెళ్లగా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఉరి వేసుకుని ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని, కిందకు దించి చూసే వరకు సురేష్ మృతి చెంది ఉన్నాడు.
శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు పోలీసులు. మృతుడి అన్న బొబ్బిలిరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.