Bus Accident : నేపాల్ ప్రమాదం.. 41 మందికి చేరిన మృతుల సంఖ్య

నేపాల్ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 41కు చేరుకుంది. నిన్న నేపాల్ లో బస్సు లోయలోపడిన సంగతి తెలిసిందే.

Update: 2024-08-24 02:32 GMT

నేపాల్ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 41కు చేరుకుంది. నిన్న నేపాల్ లో బస్సు లోయలోపడిన సంగతి తెలిసిందే. నదిలోకి బస్సు దూసుకెళ్లడంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. వీరంతా ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు. ఉత్తర్‌ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ కు చెందిన బస్సులో ఒక టూరిస్ట్ బస్సులో 43 మంది ప్రయాణికులు, డ్రైవర్ తో పాటు ఇద్దరు క్లీనర్లు ఉన్నారు . అయితే నేపాల్ లోని పొఖారా నుంచి ఖాఠ్మండూకు ఈ బస్సు బయలుదేరింది.

అతి వేగమే కారణం...
అయితే తనహూ జిల్లాలోని అంబూ ఖైరానీ ప్రాంతానికి వచ్చేసరికి బస్సు ప్రమాదం జరిగింది. భారీ వర్షం పడుతుండటం, అతి వేగంతో బస్సును డ్రైవర్ ను నడిపినందున పక్కనే ఉన్న 150 అడుగుల లోతులో ఉన్న మార్సయాగండీ నదిలో పడిపోయింది. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినా భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. బస్సు ప్రమాదంలో అక్కడికక్కడే పదహారు మంది చనిపోయారని, మరొ 25 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని అధికారులు తలిపారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన వారు కావడంతో మృతదేహాలను తీసుకు రావడానికి భారత్ నుంచి నేపాల్ కు ప్రత్యేక విమానం బయలు దేరింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.


Tags:    

Similar News