డివైడర్ దాటుకుని వెళ్లి బస్సును ఢీ కొట్టింది
దేశ రాజధానిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని జ్యోతి నగర్ లోని గోల్ చక్కర్ సమీపంలో ఫ్లైఓవర్‌పై
దేశ రాజధానిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని జ్యోతి నగర్ లోని గోల్ చక్కర్ సమీపంలో ఫ్లైఓవర్‌పై డిటిసి బస్సును వ్యాన్ ఢీకొనడంతో ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
మృతులను సవితాదేవి (55), జితేందర్ (25)గా గుర్తించారు. మరణించిన మూడవ వ్యక్తిని ధృవీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉంది. వ్యాన్ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ప్రయాణికులు ఉన్నారని, అయితే వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) జాయ్ టిర్కీ మాట్లాడుతూ, “గురువారం నాడు మారుతీ ఈకో వ్యాన్ రోడ్డు డివైడర్‌ను దూకి, అవతలి వైపు నుండి వస్తున్న డిటిసి బస్సును ఢీకొట్టింది. డీటీసీ బస్సు భజన్‌పురా నుంచి నందనాగ్రి ప్రాంతానికి వెళ్తోంది. టాక్సీగా సర్వీసులు నడుపుతున్న ఆ వ్యాన్‌లో 11 మంది ఉన్నారు." అని తెలిపారు. వెంటనే పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని.. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.