అపార్ట్ మెంట్ పై నుంచి దూకిన బాలిక.. సూసైడ్ నోట్ లో?

కాగా.. విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన అపార్ట్ మెంట్లోనే నాలుగవ అంతస్తులో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుందని పోలీసులు..;

Update: 2023-07-04 08:28 GMT
delhi class 9 girl suicide, delhi indraprastha university

delhi class 9 girl suicide

  • whatsapp icon

తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ బాలిక.. యూనివర్సిటీ క్యాంపస్ లోని అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బలవన్మరణం చెందింది. ఈ ఘటన న్యూ ఢిల్లీలోని ద్వారకా నార్త్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఇంద్రప్రస్థ యూనివర్సిటీ క్యాంపస్ లోని ఒక అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆమె వద్ద ఒక సూసైడ్ నోట్ లభ్యమైందన్న పోలీసులు.. చదువుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసి ఉందని తెలిపారు.

కాగా.. విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన అపార్ట్ మెంట్లోనే నాలుగవ అంతస్తులో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. సోమవారం (జులై3) తెల్లవారుజామున క్యాంపస్ లో ఓ గార్డు విద్యార్థిని మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడని చెబుతున్నారు. బాలిక దూకిన శబ్దం వినగానే అందరూ బయటికి రాగా.. తల్లిదండ్రులు మాత్రం రాలేదన్నారు. అందుకు కారణం బాలిక ఇంటికి బయటి నుంచి తాళం పెట్టి.. టెర్రస్ పైకి వెళ్లిందన్నారు. బాలిక తండ్రి ఆ ఇనిస్టిట్యూట్ లోనే పనిచేస్తున్నట్లు తెలిపారు.
చనిపోయిన బాలికకు ఇద్దరు అక్కలు ఉండగా.. రెండో అక్క 11వ తరగతి చదువుతుండగా.. మొదటి సోదరి ఢిల్లీలోనే నర్సింగ్ కోర్సు చేస్తోంది. చనిపోయన బాలికపేరు కిషోరి. ఆమె సరిగ్గా చదవడంలేదని తల్లిదండ్రులు మందలించారా ? లేక తరగతిలో ఎవరైనా తిట్టారా ? లేదా ఆమె సరిగ్గా చదవదని హేళన చేశారా ? ఇలా పలు కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News