ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ ఉద్యోగి.. చేస్తున్న పనులేంటంటే..?
అతడు వీనస్ డిటెక్టివ్ ఏజెన్సీ, నోయిడాలో పనిచేశానని.. ఫీల్డ్ బాయ్ తన భాగస్వామితో కలిసి
వ్యక్తిగత సమాచారాన్ని చట్టవిరుద్ధంగా అందజేస్తున్న ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ ఉద్యోగిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలో పనిచేస్తున్న వ్యక్తి భారీగా డబ్బులు తీసుకుని సమాచారాన్ని లీక్ చేస్తున్నాడు. అతడు కాల్ డిటైల్స్ రికార్డ్ (సీడీఆర్) అందిస్తున్నాడని అధికారులకు సమాచారం అందింది. ఈ సమాచారాన్ని నిర్ధారించడానికి ఒక డమ్మీ కస్టమర్‌ను పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే పోలీసులకు వచ్చిన సమాచారం నిజమేనని తేలింది. నిందితుడు 22 ఏళ్ల పవన్ కుమార్‌ను ఆగస్టు 8న సెక్టార్ 18, రోహిణి ప్రాంతంలో పట్టుకోగా.. అతడి నుంచి పెన్ డ్రైవ్‌లో సీడీఆర్ ఉండడాన్ని గుర్తించారు. అంతేకాకుండా రూ.25,000 స్వాధీనం చేసుకున్నారు.
అతడు వీనస్ డిటెక్టివ్ ఏజెన్సీ, నోయిడాలో పనిచేశానని.. ఫీల్డ్ బాయ్ తన భాగస్వామితో కలిసి చట్టవిరుద్ధంగా ఈ పని చేస్తున్నాడని, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా డేటాను అందిస్తున్నాడని పవన్ వెల్లడించాడు. CDR, లొకేషన్ హిస్టరీ, ఆదాయపు పన్ను రిటర్న్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, యాజమాన్య రికార్డులు మొదలైనవి వీరి దగ్గర ఉన్నాయి. విచారణలో భాగంగా.. పవన్ చాలా ఏజెన్సీలు ఇలాంటి పనిలో నిమగ్నమై ఉన్నాయని, వ్యక్తిగత సమాచారం మరియు సిడిఆర్ ఇవ్వడానికి బదులుగా భారీ మొత్తంలో తీసుకున్నట్లు వెల్లడించాడు. పవన్‌ని అరెస్ట్ చేయగా, అతడికి సహకరించిన వ్యక్తి పరారీలో ఉన్నాడు.