పాపం జేమ్స్.. కొరియర్ బాయ్ ప్రాణాలు ఇలా కూడా పోతాయా

రంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది

Update: 2023-12-09 03:36 GMT

గ్రిల్స్ తెరిచి ఉండటంతో లిఫ్ట్ వచ్చిందనుకుని లోపల కాలు పెట్టిన ఓ డెలివరీ బాయ్ నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్‌పై పడిపోయాడు. ఆ తరువాత లిఫ్ట్‌పైకి రావడంతో అతడు స్లాబ్ కింద నలిగిపోయి దుర్మరణం చెందాడు. రంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జేమ్స్(38) అనే వ్యక్తి తన భార్యా పిల్లలతో కలిసి మయూరీ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతడు డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు. అతడు ఓ పార్సిల్ డెలివరీని వెనక్కు తీసుకునేందుకు అశోక్‌నగర్‌లోని నివాస్ టవర్స్‌కు వెళ్లాడు. నాలుగో అంతస్తులోని ఓ ఫ్లాట్‌ నుంచి పార్సిల్ తీసుకుని తిరిగొస్తుండగా లిఫ్ట్ గ్రిల్స్ తెరిచి ఉంది. ఆ సమయంలో ఫోన్లో మాట్లాడుతున్న అతడు లిఫ్ట్ పైకిరాని విషయాన్ని గమనించక లోపలికి కాలుపెట్టడంతో మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్ పైభాగంపై పడ్డాడు. ఆ తరువాత లిఫ్ట్ పైకి వెళ్లడంతో అతడు స్లాబ్‌కింద పడి నలిగి దుర్మరణం చెందాడు. లిఫ్ట్ మూడో అంతస్తులో ఆగిపోవడంతో మరమ్మతులు చేసేందుకు వచ్చిన మెకానిక్.. జేమ్స్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్‌ పైభాగంలో పడిపోయాడు జేమ్స్. వేరేవారు లిఫ్ట్‌ ఆన్‌చేసి పై అంతస్తులోకి వెళ్లారు. పైభాగంలో ఉన్న స్లాబ్‌ తగలడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. మూడో అంతస్తులో ఆగిపోవడంతో మెకానిక్‌ వచ్చి మరమ్మతులు చేస్తుండగా పైభాగంలో మనిషి చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అపార్టుమెంట్ వాసులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.


Tags:    

Similar News