Hyderabad : ఆరు కోట్ల నగదు.. ఆరు కార్లు.. ఆరు సూట్ కేసులు
తెలంగాణ ఎన్నికల వేళ నగదు భారీగా పట్టుబడుతుంది. పోలీసుల తనిఖీల్లో కట్టలు కట్టలు నగదు బయటపడుతుంది.
తెలంగాణ ఎన్నికల వేళ నగదు భారీగా పట్టుబడుతుంది. పోలీసుల తనిఖీల్లో కట్టలు కట్టలు నగదు బయటపడుతుంది. అన్ని చోట్ల పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలలో ఎక్కువ నగదును తీసుకెళుతూ చిక్కుతున్నారు. నగదుకు సంబంధించిన సరైన రికార్డులు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే ఈ పట్టుడుతున్న నగదు హవాలా నగదా? లేక ఎన్నికల కోసం తీసుకు వెళుతున్న నగదా? అన్నది తెలియాల్సి ఉంది. కానీ ఎన్నికల సమయంలో కోట్లకు కోట్ల కరెన్సీ కట్టలు బయటపడుతుండటంతో ఈ ఎన్నికలు ఎంత కాస్ట్లీగా జరుగుతున్నాయో చెప్పకనే తెలుస్తుంది.
అప్పా కూడలి వద్ద తనిఖీలో...
తాజాగా హైదరాబాద్ నగర శివార్లలో భారీగా నగదు బయటపడింది. ఆరు కార్లలో తరలిస్తున్న నగదు పోలీసుల తనిఖీల్లో బయటపడింది. అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని అప్పా కూడలి వద్ద ఈ సొమ్ము దొరికింది. మొత్తం ఆరు కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించిన సరైన పత్రాలు లేవని పోలీసులు చెబుతున్నారు. నగదు ఎవరిది? ఎక్కడికి తీసుకెళుతున్నారన్న దానిపై ఇంకా వివరాలు అందాల్సి ఉంది. పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా ఈ తనిఖీల్లో పాల్గొంటున్నాయి.