రోడ్డు మీద ఎలక్ట్రికల్ బెంజ్ కార్ బీభత్సం

ఫిలింనగర్లో ఎలక్ట్రికల్ బెంజ్ కార్ బీభత్సం సృష్టించింది. కానీ ఈ ప్రమాదంలో

Update: 2023-07-31 08:42 GMT

ఫిలింనగర్లో ఎలక్ట్రికల్ బెంజ్ కార్ బీభత్సం సృష్టించింది. కానీ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కూడా యువతలో మాత్రం మార్పు రావడం లేదు. మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదాలకు కారకులవు తున్నారు.. ఓ యువతి కూడా ఎలక్ట్రికల్ బెంజ్ కారు ను రాష్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా కారు అదుపు తప్పడంతో మొదట చెట్టును.... ఆ తర్వాత ఎలక్ట్రికల్ పోల్ ను....చివరగా గోడను ఢీ కొట్టి ఓ ప్రదేశంలో ఆగిపో యింది... ఇలా రోడ్డు మీద అన్నిటిని ఢీకొట్టుతూ వెళ్తు న్న కారును చూసి స్థాని కులు తీవ్ర భయభ్రాంతు లకు గురయ్యారు... ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుం దోనని కంగారు పడ్డారు... కానీ రోడ్డుపై ఇంత బీభత్సం సృష్టించిన కూడా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగ లేదు... ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందులో ఉన్న యువతి ప్రాణాలతో బయటపడింది. ప్రమాదం జరిగిన అనం తరం ఆ యువతి కారును అక్కడే వదిలేసి తన హై హీల్స్ భుజాన వేసుకొని మెల్లిగా అక్కడి నుండి జారుకుంది. యువతి మితిమీరిన వేగంతో కారు నడపడం వల్ల కారు రెండు టైర్లు ఊడిపోయి కొద్ది దూరంలో పడ్డాయి. కారు ఆగిపోయిన ప్రమాద స్థలంలో ఒక గుడిసె ఉంది. అందులో వాచ్మెన్ ఫ్యామిలీ ఉంటుంది... ఈ కారు గుడిసెకు అడుగు దూరంలో మాత్రమే ఆగింది. రోడ్డుపై బీభత్సం సృష్టిస్తూ అత్యంత వేగంగా వెళ్లి గుడిసెలు ఢీ కొట్టి ఉంటే జరగరాని ప్రమాదం జరిగేది. కానీ ఈ ప్రమాదంలో వాచ్మెన్ ఫ్యామిలీకి పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే ఫిలింనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న సిసి కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల్లో ఉన్న నెంబర్ ప్లేట్ ను ఆధారంగా చేసుకుని మహిళను గుర్తించి పట్టుకునే పనిలో పడ్డారు...


Tags:    

Similar News