Delhi : ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు గ్యాంగ్‌స్టర్లను..?

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు గ్యాంగ్‌స్టర్లు పోలీసుల చేతికి చిక్కారు

Update: 2024-03-12 05:42 GMT

దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు గ్యాంగ్‌స్టర్లు పోలీసుల చేతికి చిక్కారు. నిన్న అర్థరాత్రి జరిగిన ఈ ఎన్‌కౌంటర్ ఢిల్లీలో కలకలం సృష్టించింది. ఎన్‌కౌంటర్ లో గాయపడిన గ్యాంగ్‌స్టర్లు ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈశాన్య ఢిల్లీలోని అంబేద్కర్ కళాశాల సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...
ఈ ఎన్‌కౌంటర్ లో పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఢిల్లీలోని హాసిం ముఠాకు చెందిన ముగ్గురు గ్యాంగ్‌స్టర్లు ఈ నెల 9న ఒక వ్యక్తిని కాల్చి చంపారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఒకచోట వీరు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లగా వారిపై గ్యాంగ్‌స్టర్లు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. అయితే ఈ ఎన్‌కౌంటర్ లో ఎవరూ మృతి చెందలేదు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News