ఛత్తీస్‌గడ్ లో ఎదురు కాల్పులు.. మావో, పోలీసులకు మధ్య
ఛత్తీస్‌గడ్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక జవాను మరణించారు;
ఛత్తీస్‌గడ్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక జవాను మరణించారు. మరొక జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలయిన జవానును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్ గడ్ అటవీ ప్రాంతంలోని బేడా సమీపంలో ఈ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
జవాను మృతి...
గత కొద్ది రోజులుగా మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో మావోలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో మారణాయుధాలను కూడా భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈరోజు జరిగిన ఎదురుకాల్పులపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.