ప్రముఖ సీరియల్ నటి పల్లవి మృతి.. హత్య? ఆత్మహత్యా ?

పల్లవి డే ప్రస్తుతం 'మోన్ మనే నా' అనే టీవీ షోలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. పలు సీరియల్స్ నటించిన పల్లవి..

Update: 2022-05-16 09:24 GMT

హైదరాబాద్ : ప్రముఖ బెంగాలీ నటి, టీవీ సీరియల్ నటి పల్లవి అనుమానాస్పద మృతి చెందారు. కోల్ కతా గార్ఫా ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్లో ఉన్న ఫ్లాట్ లో పల్లవి శవమై కనిపించింది. తన బెడ్రూమ్ లో పల్లవి ఫ్యాన్ కు ఉరికి వేలాడుతూ కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. చివరిప్రయత్నంగా ఆమెను కోల్ కతాలోని ఎంఆర్ బంగూర్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారన్నారు. పల్లవి మృతి పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

పల్లవి డే ప్రస్తుతం 'మోన్ మనే నా' అనే టీవీ షోలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. పలు సీరియల్స్ నటించిన పల్లవి.. సోగ్నిక్ చక్రవర్తి అనే వ్యక్తితో లివింగ్ టుగెదర్ లో ఉంటున్నట్లు సమాచారం. పల్లవి అనుమానాస్పద రీతిలో చనిపోవడంతో.. ఆమెది హత్యా ? లేక ఆత్మహత్యా? హత్య అయితే ఎవరు చేశారు ? ఆత్మహత్య అయితే ఎందుకు చనిపోయింది? ఆమె మృతికి కారణలాంటి ? వంటి కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోగ్నిక్ చక్రవర్తిని కూడా విచారణ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. పల్లవి ఆకస్మిక మృతితో.. బెంగాలీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆమె స్నేహితులు, ఇండస్ట్రీ ప్రముఖులు పల్లవి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Tags:    

Similar News