ఆత్మహత్య చేసుకున్న ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల

పోలీసులు ప్రాథ‌మిక ఆధారాలు సేక‌రించి ప్ర‌త్యూష మృత‌దేహాన్ని ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Update: 2022-06-11 14:15 GMT

ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల శనివారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌లోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 35 ఏళ్ల ప్రత్యూష బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిల్మ్ నగర్‌లోని ఓ ఇంట్లో ఉంటోంది. శనివారం మధ్యాహ్నం ఆమె స్పందించకపోవడంతో సెక్యూరిటీ గార్డులు పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా బాత్‌రూమ్‌లో ఆమె మృతదేహం కనిపించింది. వాష్‌రూమ్‌లో రసాయనాల బాటిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీలో ఉన్న బంధువులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యూష తన సొంత ఫ్యాషన్ లేబుల్‌ని స్థాపించారు, ఆమె రూపొందించిన ప్రోడక్ట్స్ ప్రత్యూష గరిమెళ్ల బ్రాండ్ పేరుతో విక్రయిస్తూ ఉన్నారు.

డిప్రెష‌న్‌కు గురైన నేప‌థ్యంలోనే ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు ప్రారంభించారు. కార్బ‌న్ మోనాక్సైడ్‌ను స్టీమ్ లో కలుపుకుని పీల్చి ప్ర‌త్యూష ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె గ‌దిలో కార్బ‌న్ మోనాక్సైడ్ బాటిల్‌ను పోలీసులు క‌నుగొన్నారు. పోలీసులు ప్రాథ‌మిక ఆధారాలు సేక‌రించి ప్ర‌త్యూష మృత‌దేహాన్ని ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రవీనా టాండన్, పరిణీతి చోప్రా, హుమా ఖురేషి, కాజోల్, శ్రియా సరన్, కాజల్ అగర్వాల్, మాధురీ దీక్షిత్, జూహీ చావ్లా, గౌహర్ ఖాన్, నేహా ధూపియా, భూమి పెడ్నేకర్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖుల కోసం గరిమెళ్ల దుస్తులను డిజైన్ చేశారు.


Tags:    

Similar News