సునీత దీనికి సమాధానం చెబుతారా?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి

Update: 2021-11-22 04:18 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీబీఐ వరస అరెస్ట్ లతో హత్యకు వెనకు ఎవరు ఉన్నారన్న దానిపై కొందరు సీబీఐకి లేఖలు రాస్తున్నారు. తాజాగా జర్నలిస్ట్ భరత్ సీబీఐ డైరెక్టర్ కు రాసిన లేఖ సంచలనం రేపుతుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇప్పటి వరకూ దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. దస్తగిరి ఈ కేసులో అప్రూవర్ గా మారారు.

ఆస్తి తగాదాలు....
కాగా జర్నలిస్ట్ భరత్ చెప్పిన వివరాల ప్రకారం వైఎస్ వివేకాను హత్య చేసింది ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి అని పేర్కొనడం విశేషం. వివేకా తన ఆస్తులను వేరే వారికి రాస్తుండటం, ఆ మహిళకు డబ్బులు విచ్చలవిడిగా ఇస్తుండటంతో కుటుంబంలో విభేదాలు తలెత్తాయని చెప్పారు. ఈ హత్యకు వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ మేరకు సీబీఐకి ఆయన లేఖ రాశారు.


Tags:    

Similar News