ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి?

మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఛత్రపతి శంభాజీనగర్ లో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు;

Update: 2024-04-03 05:29 GMT

మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఛత్రపతి శంభాజీనగర్ లో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు ప్రాధమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులతో పాటు ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఈ తెల్లవారు జామున టైలరింగ్ షాపులో మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు.

ఊపిరి ఆడక...
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయ కార్యక్రమాలను చేపట్టారు. వెంటనే మంటలను అదుపులోకి తెచ్చినా అప్పటికే మరణించడంతో సహాయక చర్యలు చేపట్టారు. మంటలు చెలరేగడం వల్ల పొగ ఏర్పడటంతోనే ఊపిరి ఆడక కొందరు మరణించారని చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.


Tags:    

Similar News