రెచ్చిపోతున్న స్మగ్లర్లు.. ఫారెస్ట్ బీట్ లో చెలరేగిన మంటలు

ఎర్రచందనం కోసం తరచూ నిప్పు పెట్టడం వల్ల అరుదైన వృక్ష, జంతు జాతులు అంతరించిపోతున్నాయి. అధికారుల దృష్టి మరల్చేందుకు..

Update: 2022-03-17 05:30 GMT

తిరుపతి : తిరుపతిలోని శేషాచలం అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అటవీశాఖ అధికారుల దృష్టిని మరల్చేందుకు దట్టమైన అటవీప్రాంతంలో అగ్గిరాజేస్తున్నారు. తాజాగా కరకంబాడి ఫారెస్ట్ బీట్ లో మంటలు చెలరేగాయి. ఎగసిపడుతున్న మంటలను గమనించిన అధికారులు.. ఫైర్ సిబ్బందికి సమాచారమివ్వగా.. వారు మంటలను అదుపుచేశారు. ఎర్రచందనం కోసమే స్మగ్లర్లు అడవికి నిప్పు పెడుతున్నారని అధికారులు తేల్చారు.

ఎర్రచందనం కోసం తరచూ నిప్పు పెట్టడం వల్ల అరుదైన వృక్ష, జంతు జాతులు అంతరించిపోతున్నాయి. అధికారుల దృష్టి మరల్చేందుకు స్మగ్లర్లు రేపుతున్న కార్చిచ్చు వల్ల అడవిలో ఉన్న జీవరాశుల ఉనికికి ప్రమాదం జరుగుతోంది. ఏపీలో గడిచిన మూడు, నాలుగు రోజులుగా కార్చిచ్చు కల్లోలం రేపుతోంది. తూ.గో, అనంతపురం జిల్లాల్లోనూ స్మగ్లర్లు అడవికి నిప్పు పెడుతున్నారు. ఫలితంగా మూగజీవాలు గ్రామాల్లోకి వస్తున్నాయి. ఏ క్షణం మృగం దాడి చేస్తుందోనని ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రాణాలు గుప్పిట్లోపెట్టుకుని బ్రతుకుతున్నారు.


Tags:    

Similar News