ఫేమస్ షూటింగ్ స్పాట్.. వ్యక్తి హత్య
కరణ్ జోహార్ చిత్రం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో కనిపించే ఫేమస్ భవనం
కరణ్ జోహార్ చిత్రం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో కనిపించే ఫేమస్ భవనం ఇప్పుడు అనుకోని కారణాలతో వార్తల్లో నిలిచింది. గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లో జరిగిన వివాహ వేడుకలో 55 ఏళ్ల అశోక్ యాదవ్ అనే వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. అశోక్‌ను శేఖర్ అనే వ్యక్తి కాల్చిచంపాడు. ఈ ప్రాపర్టీ గౌర్ గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ యాజమాన్యంలో ఉంది. దీనికి గౌర్ మల్బరీ మాన్షన్స్ అని పేరు పెట్టారు. అనేక సినిమాల షూటింగ్ లు ఇందులో జరిగాయి. గౌర్ మల్బరీ మాన్షన్స్ విశాలమైన పచ్చిక బయళ్ళు, రిచ్ నెస్ తో కూడిన ఇంటీరియర్స్‌కు ప్రసిద్ధి చెందింది. ఇది సెక్టార్ 1, నోయిడా ఎక్స్‌టెన్షన్, గ్రేటర్ నోయిడాలో ఉంది. వివాహ వేడుకల మధ్య జరిగిన హత్య ఊహించని విషాదాన్ని నింపింది.
సెంట్రల్ నోయిడా పోలీసు డిప్యూటీ కమిషనర్ సునీతి ప్రకారం, శేఖర్- అశోక్ మధ్య వాగ్వాదం పెరిగింది. ఫలితంగా శేఖర్ లైసెన్స్ రివాల్వర్‌ను ఉపయోగించి అశోక్ తలపై రెండుసార్లు కాల్చడంతో అతడు చనిపోయాడు. కాల్పుల ఘటన తర్వాత శేఖర్ అక్కడి నుండి పారిపోయాడు. సినిమా షూటింగ్ లకు పేరుగాంచిన ఈ ప్రాంతంలో ఇలా హత్య జరగడంతో వార్తల్లో నిలిచింది ఆ ప్రాపర్టీ. రణవీర్ సింగ్అలియా భట్ ఇతర స్టార్ నటీనటులు నటించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రానికి ఈ లొకేషన్ మంచి ప్లస్ గా మారింది. ఈ సినిమాలో షబానా అజ్మీ, ధర్మేంద్ర, జయా బచ్చన్ లాంటి లెజెండరీ నటీనటులు నటించారు. ఈ చిత్రం జూలై 28, 2023న విడుదలైంది. కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది.