కష్టాలను భరించలేక.. కుటుంబం ఆత్మహత్య

పాలక్కడ్ కు సమీపంలో ఉన్న నదిలో దూకి వారంతా ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసిన బంధువులు ..

Update: 2022-02-27 10:46 GMT

పాలక్కడ్ : మనకు వచ్చే కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటూ.. వాటిని పరిష్కరించుకుంటూ బతకడమే జీవితం. అలాంటిది ఏదో ఆపద వచ్చిందని, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని అర్థంతరంగా జీవితాలను ముగించుకోవడం సరైనది కాదు. ఆత్మహత్య క్షమించరాని నేరం. తాజాగా కేరళలో ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం స్థానికులను కలచివేసింది. వివరాల్లోకి వెళ్తే.. పాలక్కడ్ లో జరిగిందీ దారుణం. కష్టాలను తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.

పాలక్కడ్ కు సమీపంలో ఉన్న నదిలో దూకి వారంతా ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసిన బంధువులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఆత్మహత్యల గురించి తమకు ముందే సమాచారం ఇచ్చారని, తాము వెళ్లేసరికే జరగాల్సిన ఘోరం జరిగిపోయిందంటూ రోధిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను బయటికి తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా.. మృతుల ఇంటిని శోధించగా.. సూసైడ్ నోట్ లభ్యమైందని బంధువులు తెలిపారు. చనిపోయిన నలుగురూ ఎక్కడ, ఎందుకు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని లేఖలో వెల్లడించారని చెప్పారు. ఆ ప్రాంతంలో వారికి సంబంధించిన చెప్పులు, దుస్తులు నది ఒడ్డున పడి ఉండడం చూసి ఆత్మహత్యగా నిర్ధారించుకున్నట్లు వివరించారు.



Tags:    

Similar News