ఆశారాం బాపూ దోషి : నిర్ధారించిన న్యాయస్థానం

ఆశారాం బాపూ దోషిగా గాంధీనగర్ కోర్టు నిర్ధారించింది. ఒక అత్యాచారం కేసులో ఆశారాం బాపూ నిందితుడిగా ఉన్నారు.;

Update: 2023-01-30 12:53 GMT

ఆశారాం బాపూ దోషిగా గాంధీనగర్ కోర్టు నిర్ధారించింది. ఒక అత్యాచారం కేసులో ఆశారాం బాపూ నిందితుడిగా ఉన్నారు. అయితే దీనిపై విచారణ జరిపిన గాంధీనగర్ కోర్టు దోషిగా తేల్చింది. రేపు ఆయనకు శిక్షను ఖరారు చేయనుంది. ఆధ్యాత్మిక గురువుగా ఆయనకు పేరుంది. యోగా, వేదాంతం, భక్తి, ముక్తి వంటి పై ఆశారాం బాపూ బోధిస్తారు. ప్రవచనాలు చెబుతారు. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఆయనకు భక్తులున్నారు.

రేపు శిక్ష...
అయితే ఆశారామ్ బాబూ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు 2013లో బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆశ్రమంలో ఆయన తనపై లైంగిక దాడి జరిపినట్లు బాలిక ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారించిన గాంధీనగర్ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. మిగిలిన నిందితులను మాత్రం నిర్దోషులుగా తేల్చింది.


Tags:    

Similar News