దారుణం.. బాలిక నోట్లో కవర్లు కుక్కి అత్యాచారం..

ఒక నిర్మానుష్య ప్రదేశంలో అర్థనగ్నంగా ఉన్న బాలిక శవాన్ని గుర్తించారు. కామాంధులు బాలిక నోట్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కి..

Update: 2023-01-18 12:45 GMT

gujarat crime news

దేశమంతా సంక్రాంతి పండుగ సంబరాల్లో బిజీగా ఉన్న వేళ.. గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. 8 సంవత్సరాల బాలిక నోట్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కి.. కామాంధులు తమ పైశాచికాన్ని ప్రదర్శించారు. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ రాష్ట్రంలోని బొటాడ్ లో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం (జనవరి 15) సాయంత్రం 4.30 గంటల సమయంలో గాలిపటం తెచ్చుకునేందుకు బయటికెళ్లింది బాలిక. ఎంతసేపటికి కూతురు ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు కంగారుగా చుట్టుపక్కల వెతికారు.

తెలిసిన వారిళ్లల్లో ఆరా తీశారు. ఎక్కడా ఎవరికీ కనిపించకపోవడంతో.. చివరికి స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. బాలిక ఆచూకీ కోసం విస్తృతంగా గాలించారు. ఒక నిర్మానుష్య ప్రదేశంలో అర్థనగ్నంగా ఉన్న బాలిక శవాన్ని గుర్తించారు. కామాంధులు బాలిక నోట్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించి.. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితుల్ని తక్షణం అరెస్టు చేసి శిక్షించాలంటూ.. బాలిక కుటుంబ సభ్యులతో పాటు.. స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఒకచోట చేరి.. ఆందోళన చేశారు.




Tags:    

Similar News