నా కుమారుడిని 'గే' అంటూ ఏడిపించేవారు.. అందుకే!!

జార్జియాలోని ఒక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులను

Update: 2024-09-08 06:43 GMT
జార్జియాలోని ఒక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులను కాల్చిచంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు 14 ఏళ్ల కోల్ట్ గ్రే. అతడి తండ్రి మాట్లాడుతూ తన కొడుకును సహచర విద్యార్థులు తరచూ బెదిరించేవారని, ఎగతాళి చేసేవారని తెలిపారు. తన కొడుకును తరచుగా "గే" అని పిలవడమే కాకుండా ఎన్నోసార్లు ఏడిపించారని కోల్ట్ గ్రే తండ్రి కొలిన్ గ్రే చెప్పుకొచ్చారు.

నా కొడుకు సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకున్నాము.. కోల్ట్ గ్రే 8వ తరగతిలో ఉన్నప్పుడు ఎదురైన అనుభవాల కారణంగా అతను పాఠశాలకు వెళ్లడం కూడా చాలా కష్టంగా మారింది. తన కొడుకుని గోల్ఫ్ జట్టులో చేర్పించడానికి చాలా ప్రయత్నాలు చేసినట్లు కొలిన్ గ్రే తెలిపారు. అయితే అక్కడ కూడా తన కొడుకును గే అంటూ ఏడిపించారని కొలిన్ గ్రే వివరించారు.

కోల్ట్ గ్రే నాలుగు హత్యల్లో భాగమయ్యాడని అధికారులు తెలిపారు. తన కుమారుడికి ఆయుధాన్ని అందుబాటులో ఉంచినందుకు అతడి తండ్రిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబరు 4న, కోల్ట్ అపాలాచీ హైస్కూల్‌లో దాడి చేయడానికి సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌ను ఉపయోగించాడు. అతడి కాల్పుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు, ఇద్దరు 14 ఏళ్ల విద్యార్థులు మరణించారు.


Tags:    

Similar News