అసెంబ్లీ ముందు రోడ్డు ప్రమాదం.. ఉద్యోగి మృతి
మురళీకృష్ణ అనే ప్రభుత్వ ఉద్యోగి టూ వీలర్ పై వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో
తెలంగాణలోని హైదరాబాద్ లో అసెంబ్లీ ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాలను పరిశీలిస్తే.. మురళీకృష్ణ అనే ప్రభుత్వ ఉద్యోగి టూ వీలర్ పై వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెెందారు.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని ఆర్టీసీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మురళీ కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కాగా.. గతరాత్రి షేక్ పేట్ ఫ్లై ఓవర్ పై జరిగిన ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. వేగంగా వచ్చిన కారు బైకర్ ను ఢీ కొట్టడంతో.. అతను ఫ్లై ఓవర్ పై నుంచి కిందకు పడి.. తీవ్రగాయాలతో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.