గొంతులోకి దూసుకెళ్లిన బుల్లెట్ .. మృతి
ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ప్రమాదంలో గాయపడిన రజనీకుమార్ మృతి చెందారు.;
ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ప్రమాదంలో గాయపడిన రజనీకుమార్ మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే కానిస్టేబుల్ మృతి చెందారు.2021 బ్యాచ్ కుచెందిన రజనీకుమార్ ఉదయం గన్ శుభ్రపరుస్తుండగా మిస్ ఫైర్ అయిందని చెబుతున్నారు. రజనీకుమార్ గుడిపేట 13వ బెటాలియన్ లో పనిచేస్తున్నారు. ఆయన స్వగ్రామం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్‌పల్లి.
మరణించడంతో...
కానిస్టేబుల్ మరణించడంతో జిల్లాలోని పోలీసు శాఖలో విషాదం నెలకొంది. బుల్లెట్ గొంతులోకి దిగడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే లోపే కానిస్టేబుల్ మరణించారు. జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఘటన పై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.