Telangana : హోలీ వేళ... విషాదం... నీట మునిగి పథ్నాలుగు మంది మృతి

తెలంగాణలో హోలీ పండగ అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. హోలీ పండగ వేళ వివిధ ప్రాంతాల్లో పథ్నాలుగు మంది వరకూ మరణించారు

Update: 2024-03-26 01:59 GMT

తెలంగాణలో హోలీ పండగ అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. హోలీ పండగ వేళ వివిధ ప్రాంతాల్లో పథ్నాలుగు మంది వరకూ మరణించారు. హోలీ పండగ చేసుకున్న తర్వాత స్నానాలకు వెళ్లి నదులు, చెరువుల్లో మరణించారు. ఇప్పటి వరకూ నదిలో మునిగిన ఒకరి జాడ తెలియలేదు. మృతి చెందిన వారిలో చిన్నారులతో పాటు యువకులు కూడా ఉండటంతో వారి కుటుంబాలు హోలీ పండగ నాడు విషాదంలో మునిగిపోయాయి. కుమరం భీం జిల్లాలోని వార్దా నదిలో హోలీ అనంతరం స్నానానికి వెళ్లి నీట మునిగి నలుగురు యువకులు మరణించారు. మరణించిన వారిని కమలాకర్, సంతోష్, ప్రవీణ్, ఆలం సాయిగా గుర్తించారు.

వివిధ ప్రాంతాల్లో...
మంచిర్యాలలో క విద్యార్థి కార్తీక్ తానిమడుగు వద్ద స్నానానికి వెళ్లి నీట మునిగి చనిపోయాడు. కార్తీక్ ఈతరాక వల్లనే చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఆదిలాబాద్ లోని జైజవాన్ నగర్ కు చెందిన హర్షిత్ భీంసరి వాగులో పడి మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని జగన్, సురేందర్ లు హోలీ అనంతరం నదిలో స్నానాలకు వెళ్లి మునిగిపోయి మరణించారు. నారాయణపేటలో వాటర్ ట్యాంక్ కూలి చిన్నారి ప్రణీత మరణించింది. వనపర్తి జిల్లాలోనూ శ్రీకాంత్ అనే యువకుడు నీట మునిగి మరణించారు. మహబూబాబాద్ లో రిత్విక్ రెడ్డి చెరువులో పడి మరణించాడని పోలీసులు తెలిపారు. హనుమకొండలో ఎస్సార్ఎస్పీ కెనాల్ పోడి కేదారేశ్వర్, క్రాంతికుమార్ మరణించగా, మొర్రేడు వాగులో పడి శ్రీకాంత్ మరణించాడని పోలీసులు తెలిపారు. ఇలా అనేక ప్రాంతాల్లో పథ్నాలుగు మంది మరణించారు.


Tags:    

Similar News