కిడ్నీలో రాళ్లను తొలిగిస్తామని చెప్పి.. ఏకంగా కిడ్నీనే..!

Update: 2022-11-12 08:10 GMT

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కిడ్నీలో రాళ్లను తొలిగిస్తామని చెప్పి.. ఏకంగా కిడ్నీనేతీసివేశారు. కిడ్నీలో రాళ్ల తొలగింపు శస్త్రచికిత్స చేస్తున్నామని చెబుతూ.. ఓ వ్యక్తి ఎడమ కిడ్నీని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు తొలగించారు. 53 ఏళ్ల బాధితుడు సురేష్ చంద్ర హోంగార్డుగా పనిచేస్తున్నాడు. సురేశ్‌కు పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో అల్ట్రాసౌండ్‌ చేయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అతని కిడ్నీ కనిపించడం లేదని అల్ట్రాసౌండ్‌ లో చూపించింది

సురేష్ కాస్‌గంజ్‌లోని చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (CDO) కార్యాలయంలో పని చేస్తున్నాడు. సంఘటన గురించి తెలియడంతో అతడు పని చేస్తున్న సంస్థ లోని అధికారులు కూడా షాకయ్యారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా సీఎంఓను కోరినట్లు సీడీఓ తెలిపారు. దీనిపై ఆస్పత్రి నుంచి ఎలాంటి స్పందన లేదు. సురేష్ మాట్లాడుతూ ఏప్రిల్ 14 న మొదటిసారి అల్ట్రాసౌండ్ చేశారని.. ఆ సమయంలో ఎడమ కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లు తెలిసింది. కస్గంజ్ జిల్లాలోని నాగ్లా తాల్ గ్రామానికి చెందిన సురేష్ ను డయాగ్నస్టిక్ సెంటర్ సిబ్బంది అలీఘర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి.. అక్కడ అతనికి అల్ట్రాసౌండ్ చేయించారు. ఏప్రిల్ 14న క్వార్సీ రోడ్‌లోని ఆసుపత్రిలో చేర్పించి.. అదే రోజు ఆపరేషన్ నిర్వహించారు. వైద్యులు రాళ్లు తొలగించారని, మందులను కూడా అందజేశారు. ఏప్రిల్ 17న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు సురేష్. ఇటీవల సురేష్ కు విపరీతమైన నొప్పులు రావడంతో కాస్గంజ్‌లోని వైద్యుడిని సంప్రదించాడు, అల్ట్రాసౌండ్ చేయమని అడిగాడు. తీరా చూస్తే కిడ్నీనే లేకుండా పోయింది. తన ఒక కిడ్నీ కనిపించకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని సురేష్ తెలిపాడు. ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించగా వారి నుంచి సరైన స్పందన రాలేదని.. మత్తులో ఉండటంతో ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ను గుర్తించలేకపోయానని బాధితుడు చెప్పాడు.


Tags:    

Similar News