హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్, గంజాయి పట్టుబడ్డాయి. ముంబయికి చెందిన నలుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2023-02-14 06:42 GMT

హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్, గంజాయి పట్టుబడ్డాయి. ముంబయికి చెందిన నలుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్కోటిక్ విభాగం పోలీసులు జరిపిన దాడుల్లో భారీగా డ్రగ్స్, గంజాయి పట్టుబడ్డాయి. ఈ స్మగ్లర్ల నుంచి 204 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి కూడా...
నగరంలోని పలువురు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు ముఠా ముంబయి నుంచి హైదరాబాద్ కు వచ్చింది. అలాగే మరో ముఠా నుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News