ఖరీదైన కారులో వచ్చారు.. ఉన్నది దోచుకెళ్లారు.. పట్టపగలే భారీ దోపిడి
దోపిడీ దొంగలు వరంగల్ ప్రజలకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అపార్ట్‌మెంట్సే వాసులనే టార్గెట్..
దోపిడీ దొంగలు వరంగల్ ప్రజలకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అపార్ట్‌మెంట్సే వాసులనే టార్గెట్ చేస్తున్నారు దొంగలు. ఖరీదైన కారులో క్లాస్ గా వచ్చి చోరీలకు పాల్పడుతుండటం గమనార్హం. అంతేకాదు ఈ దొంగతనాలు రాత్రుల్లో కాదు.. పట్టపగలే జరగడం విశేషం. వరంగల్ – హనుమకొండ పట్టణాల్లో లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు అపార్ట్‌మెంట్లలో సేమ్ సినీ ఫక్కీలో దోపిడీలకు పాల్పడ్డారు. ఎంచక్క కారులో వచ్చి క్లాస్‌గా దోచుకెళ్లారు. అపార్ట్‌మెంట్లలో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇదంతా పోలీస్ అధికారులు క్రైమ్ సమావేశంలో ఉన్న సమయంలో పట్టపగలే జరిగింది.
ఇలా పట్టపగలే జరగడం పోలీసులు సైతం షాకవుతున్నారు. రిచ్‌గా ఖరీదైన కార్లు వచ్చిన దొంగలు ఈ దోపిడికి పాల్పడ్డారు. దర్జాగా అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి వారికి ఏదో గిఫ్ట్ ఆఫర్ వచ్చిందని వాచ్ మెన్‌ను నమ్మించి లోపలికి వెళ్లారు. తాళాలు వేసి వెళ్ళిన ఫ్లాట్లను ఎంచుకుని మరి తాళాలు పగలగొట్టి ఆ ఇళ్లలోని బంగారం, విలువైన వస్తువులు నగదు లూటీలకు పాల్పడ్డారు.
ఈ దోపిడి దొంగలు ఏకంగా ఆరు ఆపార్ట్‌మెంట్లలో చోరీలకు పాల్పడ్డారు. సుమారు 170 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, భారీ ఎత్తున నగదు విలువైన వస్తువులు, దోపిడీకి గురైనట్లుగా గుర్తించారు.. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. వరంగల్ లోని గాయత్రి రెసిడెన్సీ, వద్దిరాజు రెసిడెన్సీలో చోరీ జరిగింది. హనుమకొండ నయీమ్ నగర్ ప్రాంతంలోని కల్లెడ అపార్ట్మెంట్, లహరి అపార్ట్ మెంట్, మారుతి అపార్ట్ మెంట్ తో పాటు మరో అపార్ట్ మెంట్ లో దోపిడిలు జరిగాయి. అయితే నిందితుల ఉపయోగించిన కారు ఆధారంగా ఈ ముఠా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎక్స్‌పర్ట్స్‌గా భావిస్తున్నారు పోలీసులు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసు కమిషనర్ ఏవి రంగనాథ్ వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అక్కడి ప్రాంతంలో సీసీ పుటేజీలను సైతం పరిశీలిస్తున్నారు.