దంపతుల ప్రాణం మీదికి తెచ్చిన బిర్యానీ గొడవ..

గతరాత్రి కరుణాకరన్ ఇంటికి బిర్యానీ తెచ్చుకుని.. భార్యకు పెట్టకుండానే తినేశాడు. దాంతో నాకెందుకు బిర్యానీ తీసుకురాలేదని..

Update: 2022-11-09 11:22 GMT

couple biryani fight

ఓ బిర్యానీ వివాదం దంపతుల ప్రాణం మీదికి తీసుకొచ్చింది. చెన్నైలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వృద్ధ దంపతుల మధ్య బిర్యానీ కోసం గొడవ జరగ్గా.. భర్త ఆవేశంలో భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆ మంటలను తట్టుకోలేని ఆమె నేరుగా వెళ్లి భర్తను కౌగిలించుకోవడంతో.. ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. అయనవరం ఠాగూర్ నగర్లో కరుణాకరన్ (75), భార్య పద్మావతి (66) నివాసం ఉంటున్నారు.

గతరాత్రి కరుణాకరన్ ఇంటికి బిర్యానీ తెచ్చుకుని.. భార్యకు పెట్టకుండానే తినేశాడు. దాంతో నాకెందుకు బిర్యానీ తీసుకురాలేదని భార్య ప్రశ్నించింది. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. పద్మావతి అడిగిన ప్రశ్నకు మాట్లాడుతూ.. పెళ్లయ్యాక ఒక్కరోజైనా వంట బాగా చేశావా అంటూ గొడవకు దిగాడు కరుణాకరన్. ఇద్దరి మధ్యన మాటా మాటా పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన అతను.. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆ మంటలను తట్టుకోలేక అరుస్తూ భర్తను కౌగిలించుకుంది పద్మావతి.
వృద్ధ దంపతుల అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు మంటలు ఆర్పి.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి పరిస్థితి విషమంగా ఉందని.. అప్పుడే ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు. ఒక బిర్యానీ కోసం ఆ వృద్ధ దంపతులు తమ ప్రాణాల మీదికి తెచ్చుకుని.. చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నారు.


Tags:    

Similar News