భార్యను కాల్చి.. భర్త ఆత్మహత్య.. వీడియోలు తీస్తూ ఆనందించిన స్థానికులు

నసీమ్ మాలిక్ (26) 5 నెలల క్రితం నర్గీస్ (25)ను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లికి సద్దాం అనే వ్యక్తి..

Update: 2023-07-01 08:34 GMT

సమాజంలో మానవత్వం క్షీణించిపోతుంది అనేందుకు ఇలాంటి ఘటనలే నిదర్శనం. పెళ్లై ఇంకా ఐదు నెలలైనా పూర్తవ్వని దంపతుల మధ్య గొడవలు తలెత్తాయి. వారికి సర్దిచెప్పలేక మీడియేటరే పరారయ్యాడు. భార్యపై కోపంతో భర్త.. ఆమెను కాల్చి ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన భార్య.. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే.. స్థానికులు చోద్యం చూస్తూ.. వీడియోలు తీశారే తప్ప.. ఆమెను ఆసుపత్రికి తరలించి కాపాడాలన్న ఆలోచన ఏ ఒక్కరికీ రాకపోవడం సిగ్గుచేటు.

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా మఖ్యాలి గ్రామంలో జరిగిన ఈ ఘటనపై ఎస్పీ అతుల్ శ్రీ వాస్తవ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నసీమ్ మాలిక్ (26) 5 నెలల క్రితం నర్గీస్ (25)ను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లికి సద్దాం అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించాడు. పెళ్లై ఐదునెలలైనా పూర్తిగా నిండకుండానే నసీమ్ - నర్గీస్ ల మధ్య గొడవలు మొదలయ్యాయి. దాంతో ఇద్దరూ మధ్యవర్తిత్వం వహించిన సద్దాం ఇంటికి వెళ్లగా.. వారికి నచ్చచెప్పలేక సద్దాం అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
సద్దాం ఇంటి వద్దే మళ్లీ గొడవ పడుతున్న దంపతులకు సర్దిచెప్పేందుకు పొరుగున ఉండే సాబీర్ వచ్చాడు. నువ్వెవరివి మాకు చెప్పడానికంటూ నసీమ్ తనతో తెచ్చిన గన్ తో అతడిపై కాల్పులు జరిపాడు. సాబీర్ గాయాలతో బయటపడ్డాడు. భార్యను తీసుకుని బైక్ పై అక్కడి నుంచి బయలు దేరిన నసీమ్.. కొంతదూరం వచ్చాక బండి ఆపి.. ఆమెపై కాల్పులు జరిపాడు. అనంతరం తానూ కాల్చుకుని చనిపోయాడు. అయితే.. తీవ్రగాయాలైన నర్గీస్ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే.. స్థానికులు చోద్యం చూస్తూ.. వీడియోలు తీశారే తప్ప.. కాపాడే ప్రయత్నం చేయలేదు. సమాచారం అందుకు పోలీసులు ఘటనా ప్రాంతంలో రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అతుల్ తెలిపారు. పెళ్లైనప్పటి నుంచి వారిమధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ కు పంపి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News