Hyderabad: నారాయణ కాలేజీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

హైదరాబాద్ లోని నారాయణ కళాశాల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం

Update: 2024-01-06 07:45 GMT

Hyderabad: హైదరాబాద్ లోని నారాయణ కళాశాల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. మల్లంపేట్‌ ORR బ్రాంచ్‌ గర్ల్స్‌ క్యాంపస్‌లో ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా ఏకంగా 250 విద్యార్ధినిలు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆహారం వండడంలో నాణ్యత లోపించిందని విద్యార్ధినిలు ఆరోపిస్తున్నారు. తాగడానికి ఇచ్చే నీళ్లు సైతం పరిశుభ్రంగా ఉండటంలేదని, వంటశాల అపరిశుభ్రంగా ఉంటోందని విద్యార్థులు వాపోయారు. ఆహారం విషయంలో కానీ, శుభ్రత విషయంలో కానీ నాణ్యత పాటించడంలేదని విద్యార్ధినిల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో హుటా హుటిన విద్యార్థులను స్థానికంగా ఉండే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. విద్యార్థుల అస్వస్థతకు కలుషిత ఆహారం, తాగునీరు కలుషితం కావడమే కారణంగా తెలుస్తుంది. కళాశాల వంటగదిని పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం.

ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురయిన విద్యార్థినిలను కళాశాల యాజమాన్యం ఇంటికి పంపించివేసింది. కళాశాలలో 2 వేలమందికి పైగా విద్యార్ధినిలు ఉండటంతో వారి ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల నిర్వాహకులు, అధికారులు హాస్టల్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.


Tags:    

Similar News