సాఫ్ట్ వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి

వెల్లుల్ల గ్రామ శివారులో హరీశ్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి బావిలో పడిపోయిందని అతని బాబాయ్ కొడుకుకి హరీశ్..

Update: 2022-03-15 07:30 GMT

జగిత్యాల : హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న బర్ల హరీశ్ (31) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ సుధాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన బర్ల హరీశ్ ది జగిత్యాల జిల్లా మెట్ పల్లి. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న హరీశ్.. ఏడాదిన్నర క్రితం ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారం క్రితమే స్వగ్రామమైన మెట్ పల్లికి వచ్చిన హరీశ్.. ఆదివారం సాయంత్రం స్నేహితులు ఫోన్ చేయడంతో బయటికి వెళ్లాడు.

ఆ తర్వాత వెల్లుల్ల గ్రామ శివారులో హరీశ్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి బావిలో పడిపోయిందని అతని బాబాయ్ కొడుకుకి హరీశ్ స్నేహితులు సమాచారమిచ్చారు. దగ్గర్లో ఉన్న తోటల వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా వాహనం బావిలో పడిపోయిందని వారు తెలిపారు. హరీశ్ బావిలో పడిపోయాడని, వెనుక కూర్చున్న మరో యువకుడు గట్టుపై పడిపోయాడని చెప్పారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి.. ఈతగాళ్లతో బావిలో గాలించారు. సోమవారం తెల్లవారుజామున హరీశ్ మృతదేహం లభ్యమైంది.
హరీశ్ మృతదేహాన్ని పరీక్షగా చూసిన కుటుంబ సభ్యులు.. తల వెనుకభాగం, ముక్కు, చెవుల వద్ద రక్తం కారడం గమనించారు. దాంతో అతని మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. హరీశ్ కు బాబాయ్ అయిన అభిషేక్ కూడా 12 ఏళ్ల క్రితం బావిలో పడి చనిపోగా.. ఇప్పుడు హరీశ్ అదేరీతిలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.







Tags:    

Similar News