ఆన్ లైన్ గేమ్లో. కోటి స్వాహా

ఆన్ లైన్ గేమ్ లు ఆడి 95 లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.

Update: 2022-12-21 05:04 GMT

ఆన్ లైన్ గేమ్ లు ఆడి 95 లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. రంగారెడ్డి జిల్లా సీతారాంపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డికి ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు శ్రీకాంత్ రెడ్డి బీటెక్, రెండో కొడుకు హర్షవర్ధన్ రెడ్డి డిగ్రీ చదువుతున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా కుటుంబం బతుకుతుంది. శ్రీనివాసరెడ్డి కుటుంబానికి పది ఎకరాల భూమి ఉంది. ఇటీవల ప్రభుత్వం భూసేకరణ జరపడంతో దాదాపు కోటి ఇరవై ఐదు లక్షలు శ్రీనివాసరెడ్డి కుటుంబానికి పరిహారంగా ప్రభుత్వం ఇచ్చింది.

భూసేకరణ ద్వారా....
అయితే శ్రీనివాసరెడ్డి రెండో కుమారుడు హర్షవర్థన్ రెడ్డి ఆన్లైన్ గేమ్ కు అలవాటు పడ్డాడు. తన తండ్రి, తల్లి అకౌంట్ లో ఉన్న 95 లక్షల రూపాయల డబ్బును తన అకౌంట్ లో వేసుకున్నాడు. ఆన్ లైన్ గేమ్ లు ఆడుతూ మొత్తం పోగొట్టుకున్నాడు. సెప్టంబరు నుంచి ఇప్పటి వరకూ 95 లక్షల వరకూ ఆన్ లైన్ గేమ్ ల ద్వారా హర్షవర్థన్ రెడ్డి పోగొట్టుకున్నట్లు కుటుంబ సభ్యులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు కోటి రూపాయలను కోల్పోయిన ఆ కుటుంబం లబోదిబో మంటుంది.


Tags:    

Similar News