Hyderabad : చిన్నారిపై వేగంగా కారు.. మృతి
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జింకలవాడలో చిన్నారిపై కారు దూసుకుపోయింది.
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జింకలవాడలో చిన్నారిపై కారు దూసుకుపోయింది. కొందరు యువకులు వేగంగా వచ్చి జింకలవాడ బస్తీలో ఆడుకుంటున్న చిన్నారిపై కారు దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలయింది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోగానే మరణించింది.
అతివేగమే....
బాలిక వయసు రెండేళ్లు. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కారులో ఉన్న యువకులు అందరూ పరారయ్యారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు నెంబరు ఆధారంగా యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.