నేటి నుంచి పోలీస్ కస్టడీకి టోనీ
అంతర్జాతీయ డ్రగ్స్ షెడ్లర్ టోనీని నేడు పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు
అంతర్జాతీయ డ్రగ్స్ షెడ్లర్ టోనీని నేడు పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఐదు రోజుల పాటు టోనీని పోలీసులు విచారించనున్నారు. ఈ మేరకు కోర్టు అనుమతిదచింది. ఫిబ్రవరి రెండో తేదీ వరకూ టోనీ పోలీసుల కస్టడీ లో ఉంటారు. 2013 నుంచి టోనీ ముంబయి కేంద్రంగా టోనీ డ్రగ్స్ దందాకు తెరలేపాడు. హైదరాబాద్ లో కూడా బ్రోకర్లను నియమించుకుని వ్యాపారాలను నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.
విచారణలో...
హైదరాబాద్ లో అనేక మందికి టోనీ గ్యాంగ్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. వారిలో ఏడుగురు పారిశ్రామికవేత్తలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ముంబయి నుంచి టోనీ నెట్ వర్క్ ను ఎలా నడిపాడు? మనీ ట్రాన్స్ ఫర్ కు ఏ విధానాన్ని వినియోగించాడు? ఎంతమందికి డ్రగ్స్ ను సప్లయ్ చేశాడు వంటి వివరాలను పోలీసులు ఈ విచారణలో తెలుసుకోనున్నారు.