అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
అంతర్జాతీయ సెక్స్ ర్యాకెట్ ను పోలీసులు పట్టుకున్నారు. 14,190 మందికి విముక్తి కల్పించినట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
అంతర్జాతీయ సెక్స్ ర్యాకెట్ ను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ముంబయితో పాటు బంగ్లాదేశ్, నేపాల్, థాయ్‌లాండ్, రష్యాకు చెందిన బాధితులకు విముక్తి కల్పించారు. మొత్తం 14,190 మందికి విముక్తి కల్పించినట్లు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
14,190 మందికి విముక్తి...
పలు వెబ్ సైట్ లతో ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారాన్ని ఈ ముఠా నిర్వహిస్తుందని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వ్యభిచార ముఠాను నిర్వహిస్తున్న 17 మందని అరెస్ట్ చేసినట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ దాడుల్లో పాల్గొని నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు అధికారులను ఆయన ప్రశంసించారు. ఉపాధి పేరుతో తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తుంది.