వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్.. అధికారిక ప్రకటన రానుందా..?
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాకినాడ లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. కేసు నుంచి తప్పించుకునేందుకు అనంతబాబు విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ కూడా ఎమ్మెల్సీని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించడంతో అనంతబాబు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పటికే పోలీసులు అనంతబాబుపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. హత్య కేసుకు సంబంధించి అనంతబాబు అనుచరులు కీలక విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను కొట్టిచంపినట్లు ఎమ్మెల్సీ అనుచరులు చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న అనంత ఉదయభాస్కర్.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు.