బాలాపూర్ లో బాలుడి కిడ్నాప్ విషాదాంతం
స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఫిబ్రవరి 12న ఫైజల్ అనే బాలుడు ఉస్మానియా ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పి..
ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చిన్నపిల్లలపై నేరాల సంఖ్య పెరుగుతోంది. ఆడపిల్లలపై అత్యాచారాలు, పిల్లల్ని కిడ్నాప్ చేసి హత్య చేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో బాలుడిని కిడ్నాపర్లు హతమార్చారు.
నగరంలోని బాలాపూర్ లో బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతమైంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఫిబ్రవరి 12న ఫైజల్ అనే బాలుడు ఉస్మానియా ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పి.. ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. అర్థరాత్రి దాటినా తిరిగి ఇంటికి రాకపోవడంతో.. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో శనివారం(ఫిబ్రవరి 25) రాత్రి సమయంలో ఫైజల్ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఫైజల్ హత్యకు కారణం జాఫర్ అనే వ్యక్తితో ఉన్న గొడవలే అని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలుడి హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఫైజల్ హత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.