హైదరాబాద్ లో కిడ్నాప్ కలకలం
హైదరాబాద్ లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. కింగ్ కోటి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్ లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. కింగ్ కోటి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాంపల్లిలోని ఆగపురకు చెందిన గయాజ్ భాషా రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన వయసు అరవై ఏళ్లు. నిన్న అర్థరాత్రి కింగ్ కోటి ఈడెన్ గార్డెన్ వద్ద ఉండగా భాషాను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కారులో కిడ్నాప్ చేశారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి....
ికిడ్నాప్ నకు గల కారణాలు తెలియరాలేదు. వ్యక్తిగత కక్షలా? వ్యాపార సంబంధమైన సమస్యలా? ఆర్థిక లావాదేవీలా? అన్న దానిపై అనుమానాలున్నాయి. గయాజ్ భాషా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహానికి హాజరై ఇంటికి వెళుతుండగా కిడ్నాప్ జరిగింది. దీనిపై పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నాయి.