ఆర్జీవీపై మంగళగిరి పీఎస్ లో ఫిర్యాదు

కాగా.. సోషల్ మీడియాలో ఆర్జీవీ ఒక సంచలనం. ఆయనకంటూ ఓ వర్గానికి చెందిన ఫ్యాన్ బేస్ ఉంది. ఆర్జీవీ చెప్పే విషయాలకు;

Update: 2023-07-16 05:48 GMT

ram gopal varma

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్లో కృష్ణాయపాలెం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఆర్జీవీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని పేర్కొంటూ.. ఒక లేఖ ద్వారా మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్జీవీపై కృష్ణాయపాలెం గ్రామస్తులు ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. కృష్ణాయపాలెం గ్రామస్తులు పంపిన ఆ లేఖలో ఏం రాశారో తెలియాల్సి ఉంది. ఇక తనపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అదే రీతిలో స్పందించే ఆర్జీవీ.. ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

కాగా.. సోషల్ మీడియాలో ఆర్జీవీ ఒక సంచలనం. ఆయనకంటూ ఓ వర్గానికి చెందిన ఫ్యాన్ బేస్ ఉంది. ఆర్జీవీ చెప్పే విషయాలకు ప్రత్యేకంగా అభిమానులున్నారు. ఇక ఆర్జీవీ ఏపీ అధికార పార్టీకి చెందినవారని తెలిసిందే. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ ఎదుర్కొన్న పరిస్థితులపై వ్యూహం పేరుతో ఓ సినిమాను తీస్తున్నారు. ఇటీవలే వ్యూహం టీజర్ విడుదల చేయగా.. ఏపీ రాజకీయాల్లో ఆ టీజర్ సంచలనం రేపింది. వాస్తవిక కథలను ఉన్నది ఉన్నట్టుగా ఆర్జీవీ కోణం నుంచి తెరకెక్కించడంలో ఆర్జీవీ స్పెషలిస్ట్. ఈ వ్యూహం కూడా అలాంటిదే. అయితే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారా ? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.


Tags:    

Similar News