ఘోరంగా హ‌త్య చేశారు.. భూ త‌గాదాలే కార‌ణం!

బుధవారం గ్రామానికి చెందిన దంపతులు కొత్త సాంబయ్య, లక్ష్మిలను అతి కిరాతకంగా గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు నరికి హత్య చేశారు.

Update: 2022-05-11 06:36 GMT

పెద్దపల్లి : భూముల రేట్ల‌కు రెక్క‌లొచ్చాయి. ఒక‌ప్పుడు భూముల‌ను ప‌ట్టించుకున్న నాథుడే కార‌వ‌వ్వ‌గా, ప్ర‌స్తుతం భూములు కొనేందుకు జ‌నం ఎగ‌బ‌డుతున్నారు. రియ‌ల్ రంగం కూడా న‌ర‌గ శివార్ల‌లో ఊపందుకోవ‌డంతో ఎక్క‌డా చూసినా సెంట్ భూమికి ల‌క్ష‌ల్లో విలువ ప‌లుకుతుంది. దీంతో ఆస్తి పంప‌కాల స‌మ‌యంలో సైతం ఒక్కగ‌జం భూమిని కూడా వ‌దులుకోవ‌డానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌డంతో లేదు. ఆస్తి త‌గాదాల‌తో ఎంతో మంది ప్రాణాల‌ను సైతం పోగొట్టుకున్న సంఘ‌ట‌న‌లు చూశాం. అలాంటి ఘ‌ట‌నే ఇప్పుడు పెద్దపల్లి జిల్లా మంథని మండలం చల్లపల్లిలో చోటుచేసుకుంది.

బుధవారం గ్రామానికి చెందిన దంపతులు కొత్త సాంబయ్య, లక్ష్మిలను అతి కిరాతకంగా గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు నరికి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీంతో దంపతుల హత్య ఇప్పుడు సంచలనం సృష్టించింది. భూ త‌గాదాల‌తోనే దంప‌తులు హ‌త్య‌కు గురైన‌ట్లు తెలుస్తోంది. ఎవ‌రు చంపారు? ఎందుకు చంపారు? ఇందులో కీల‌క సూత్ర‌దారులు ఎవ‌రు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బంధువుల‌కు సంబంధాలు ఉండే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో వారి ఫోన్ కాల్ రికార్డిగ్స్ సైతం ప‌రీశీలించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అనుమానితుల‌ను ముందుగా విచారించి ఆ త‌రువాత కేసును ముందుకు తీసుకెళ్ల‌నున్న‌ట్లు పోలీసులు తెలిపారు. మొత్తం మీద భూ త‌గాదాలు దంప‌తులను పొట్ట‌న‌పెట్టుకున్నాయ‌ని స్థానికులు చ‌ర్చించుకుంటున్నారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని అభంశుభం తెలిసిన దంప‌తుల‌ను చంపేశార‌ని బంధువులు కోరుతున్నారు. దీంతో చ‌ల్ల‌ప‌ల్లి మండ‌లంలో విషాధ ఛాయ‌లు అలుముకున్నాయి.


Tags:    

Similar News