సోదరి చితిమంటల్లో దూకిన యువకుడు
గమనించిన గమనించిన బంధువులు, గ్రామస్తులు ఆ యువకుడిని బయటకు తీసి.. మంటలను ఆర్పివేశారు. అనంతరం సమీపంలోని..
ఇటీవల ఉత్తరప్రదేశ్ లో క్యాన్సర్ తో మరణించిన స్నేహితుడి అంత్యక్రియలకు వెళ్లిన వ్యక్తి.. అతడి చితిమంటల్లో దూకి తీవ్రగాయాలతో మరణించిన ఘటన కలకలం రేపింది. తాజాగా అలాంటి ఘటనే రాజస్థాన్ లోనూ వెలుగుచూసింది. భిల్వారా జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల ఓ యువకుడు తన కజిన్ సిస్టర్ అంత్యక్రియలకు వెళ్లాడు. ఆకస్మికంగా జరిగిన ఆమె మరణాన్ని తట్టుకోలేక బంధువులంతా కన్నీటితోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. యువతి చితికి నిప్పంటించగానే.. ఆ యువకుడు కూడా ఆ మంటల్లోకి దూకేశాడు.
గమనించిన గమనించిన బంధువులు, గ్రామస్తులు ఆ యువకుడిని బయటకు తీసి.. మంటలను ఆర్పివేశారు. అనంతరం సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించగా.. ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని వైద్యులు తెలిపారు. కాగా.. ఆ యువకుడు ఎందుకిలా చేశాడన్న కారణాలు ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై భివారా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంచల్ మిశ్రా స్పందించారు. ఆసుపత్రి వర్గాల ద్వారా తమకు ఈ విషయం తెలిసిందని, 95 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న యువకుడు స్టేట్‌మెంట్ ఇచ్చే స్థితిలో లేడన్నారు. యువకుడు చితిమంటల్లో ఎందుకు దూకాడో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామన్నారు.