కోడిగుడ్లు అప్పు ఇవ్వలేదని కిడ్నాప్ చేసిమరీ దాడి
అక్కడ యజమాని యోగేశ్ ని కోడిగుడ్లు అరువు ఇవ్వాలని అడగగా.. అందుకు అతను నిరాకరించాడు. దానిని అవమానంగా భావించిన..
కోడిగుడ్లు అరువివ్వలేదన్న కారణంతో.. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ దాడి చేశారు. ఛత్తీస్ గఢ్ లో ఈ ఘటన జరిగింది. దాడికి గురైన వ్యక్తి ఓ బిర్యానీ సెంటర్ యజమాని. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలాస్‌పూర్ జిల్లా బర్తోరి గ్రామానికి చెందిన యోగేశ్ వర్మ బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు. కోహ్రాడా గ్రామానికి చెందిన దీపక్ చతుర్వేది, రాహుల్ కుమార్ భాస్కర్, పరమేశ్వర్ భరద్వాజ్ ఈ నెల 20న బిర్యానీ సెంటర్ కు వెళ్లారు.
అక్కడ యజమాని యోగేశ్ ని కోడిగుడ్లు అరువు ఇవ్వాలని అడగగా.. అందుకు అతను నిరాకరించాడు. దానిని అవమానంగా భావించిన యువకులు అదేరోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో కిడ్నాప్ చేసి.. కారులో ముక్తిధామ్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అతడిని అసభ్య పదజాలంతో తిడతూ దాడిచేశారు. కిడ్నాప్ పై సమాచారం అందుకున్న పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుని యోగేశ్ వర్మను విడిపించారు. కోడిగుడ్లు అప్పు ఇవ్వనందుకే వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.