Returning home: 9 సంవత్సరాలు జైలులో గడిపాడు.. ఇంటికి తిరిగి వస్తుండగా

తొమ్మిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. ఎట్టకేలకు విడుదలై

Update: 2024-09-14 02:55 GMT

తొమ్మిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. ఎట్టకేలకు విడుదలై ఇంటికి వెళుతుండగా ఊహించని విషాదం అతడి ప్రాణాలను బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 ఏళ్ల వ్యక్తి మరణించాడు. హత్య కేసులో తొమ్మిదేళ్ల జైలు శిక్ష అనుభవించి ఇంటికి తిరిగి వస్తుండగా ఆటో రిక్షాను ఎస్‌యూవీ ఢీకొనడంతో, ఆ వ్యక్తితో పాటు అతడి కుమార్తె కూడా మృతి చెందింది.

కన్నౌజ్ జిల్లాకు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తికి 2012 సంవత్సరం హత్య కేసుకు సంబంధించి జీవిత ఖైదు విధించింది కోర్టు. 2012 మేలో కన్నౌజ్‌లో ఒక వ్యక్తిని కాల్చిచంపిన కేసులో కుమార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు విజయేంద్ర కుమార్, బాబు, విజయ్ సోదరుడు రామ్ బాబు, ఛబీరామ్, విజయ్ కుమార్ సహా ఐదుగురికి శిక్ష పడింది. విజయ్ ఇంకా శిక్ష అనుభవిస్తుండగా, మిగతా వారిని ముందుగానే విడుదల చేశారు. విజయ్ ను 15 నుంచి 16 నెలల క్రితం ఇటావాలోని జైలుకు తరలించారు. అతడి అప్పీల్‌ను అనుసరించి అధికారులు ఇటీవల విడుదల చేశారు. ఆ తర్వాత ఊహించని ప్రమాదం జరిగింది
ఈ ప్రమాదంలో కుమార్‌, ఆయన కుమార్తె మృతి చెందగా, అతని భార్య, రిక్షా డ్రైవర్‌ గాయపడ్డారు. వారికి తిర్వాలోని కన్నౌజ్ మెడికల్ కాలేజీలో చికిత్స అందించారు. ఎస్‌యూవీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News