హైదరాబాద్ లో తమ్ముడి ముందే బాలికపై అత్యాచారం

హైదరాబాద్ నగరంలో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక

Update: 2023-08-22 10:35 GMT

హైదరాబాద్ నగరంలో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్ లాల్ బజార్ కు చెందిన బాలిక తల్లిదండ్రులు ఇంతకు ముందే చనిపోవడంతో 15 రోజుల నుంచి ఆమె సోదరుడితో కలిసి మీర్పేట్ లోని ఓ కాలనీకి వచ్చి సమీప బంధువు దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. బాలిక దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుంది. తమ్ముడు ఫ్లెక్సీలు కట్టే పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం 9 గంటలకు బాలిక తన సోదరుడు మరో ముగ్గురు చిన్నారులతో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఎనిమిది మంది ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఆ బృందంలోని నలుగురు బాలిక మెడపై కత్తి పెట్టారు. భవనంలోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు. మిగిలిన వారు ఆమె తమ్ముడితో పాటు అక్కడే ఉన్న చిన్నారిని బెదిరించారు. నిందితుల్లో ముగ్గురు బాలికను కత్తితో బెదిరిస్తూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో వారంతా పారిపోయారు.

విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువు మీర్‌పేట పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం సఖి కేంద్రానికి తరలించారు. ఈ కేసులో బాలిక నివాసం ఉండే భవనంలో కింది అంతస్తులో ఉండే టైసన్, మంగళహాట్‌కు చెందిన రౌడీ షీటర్ నిందితులని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. త‌మ వ‌ద్ద‌వున్న ఆయుధాల‌తో బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలుస్తోంది. దీని గురించి ఎవ్వ‌రికీ చెప్ప‌వద్దంటూ బెదిరించారని.. ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామంటూ హెచ్చ‌రించారు.


Tags:    

Similar News