మెట్రో స్టేషన్.. ఆ ఘటనకు స్టేషన్ లో ఉన్న వాళ్లంతా షాక్

ఉత్తరాఖండ్‌లోని దేవప్రయాగ్‌లో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న నజఫ్‌గఢ్ ప్రాంతంలోని ప్రేమ్ నగర్ నివాసి

Update: 2023-07-31 10:01 GMT

మెట్రో రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ మెట్రో స్టేషన్‌లో సోమవారం కదులుతున్న రైలు ముందు దూకి 31 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు ఢిల్లీ పోలీసు అధికారి తెలిపారు. మృతుడు ఉత్తరాఖండ్‌లోని దేవప్రయాగ్‌లో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న నజఫ్‌గఢ్ ప్రాంతంలోని ప్రేమ్ నగర్ నివాసి మనీష్ కుమార్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం 9.26 గంటలకు నజాఫ్‌గఢ్ స్టేషన్‌లో ఒక వ్యక్తి మెట్రో ముందు దూకినట్లు సమాచారం అందడంతో పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.

నజఫ్​గఢ్ లోని ప్రేమ్​నగర్​కి చెందిన మనీష్​కుమార్​ ఉత్తరాఖండ్​లోని దేవప్రయాగ్​లో లైబ్రేరియన్ గా పని చేస్తున్నారు. నజఫ్​గఢ్​లో ఓ వ్యక్తి మెట్రో ముందు దూకి చనిపోయినట్లు జులై 31 ఉదయం పోలీసులుకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుడేజీలను పరిశీలించారు. బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. మృతుడికి వివాహమై ఒక కుమార్తె ఉందని సీనియర్​అధికారి ఒకరు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు.


Tags:    

Similar News