మైనర్ బాలికపై ఏడాది కాలం లైంగిక దాడి.. తల్లిదండ్రులకు తెలియడంతో..

ఒక ఏడాది పాటు ఈ అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేశారు. 2021 ఏప్రిల్ నెలలో బాలిక బంధువైన..

Update: 2022-11-16 11:15 GMT

tamilnadu crime news

తమిళనాడులో ఘోరమైన ఘటన వెలుగుచూసింది. మైనర్ బాలికపై ఐదుగురు దుర్మార్గులు దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. లైంగిక దాడికి పాల్పడిన వీడియో చూపిస్తూ.. బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ బాలికకు నరకం చూపించారు. తమిళనాడులోని తిరుచ్చిలో ఈ ఘటన జరిగింది. అసలు విషయం ఏంటంటే.. మొదట బాలికపై లైంగిక దాడికి పాల్పడింది ఆమె సమీప బంధువే. వివరాల్లోకి వెళ్తే 16 ఏళ్ల బాధిత బాలికకు మత్ు మందిచ్చి ఆమె బంధువుతో పాటు మరో నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఒక ఏడాది పాటు ఈ అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేశారు. 2021 ఏప్రిల్ నెలలో బాలిక బంధువైన రంగనాథ్ బైక్ పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మత్తుమందిచ్చాడు. ఆ పై లైంగిక దాడికి పాల్పడి దానిని తన ఫోన్లో రికార్డ్ చేసి నలుగురు స్నేహితులకు ఫోన్ చేశాడు. వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ.. నలుగురూ పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టారు. కొద్దిరోజులకు బాలికలో మార్పుని గమనించిన తల్లిదండ్రులు తిరుచ్చిలోని ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు.
బాలికకు మైనార్టీ తీరకుండా వివాహం జరిపించినట్లు తెలుసుకున్న బాలల హక్కుల సంఘం.. ముసిరి పోలీసులకు సమాచారమిచ్చి బాలికలను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ క్రమంలో బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన వీడియో వాట్సప్ లో వైరల్ అయింది. రంగనాథ్ స్నేహితుల్లో ఒకరు ఆ వీడియోను షేర్ చేయగా.. రంగనాథ్ కు స్నేహితులకు మధ్య గొడవజరిగింది. మరోవైపు బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. రంగనాథన్, మణికందన్, గణేష్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Tags:    

Similar News