మైనర్ బాలికను బంధించి.. సామూహిక అత్యాచారం, వీడియో రికార్డ్ చేసి..
ఇంటికి వెళ్లిన బాలిక.. జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించింది. శనివారం (ఏప్రిల్ 29) సాయంత్రం బాలిక తండ్రి సూరమంగళం..
మైనర్ బాలికను బంధించి ఆమెపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదంతా తమ ఫోన్ లో వీడియో రికార్డ్ చేసి ఎవరికైనా చెబితే.. సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. బాదిత బాలిక తన తల్లిదండ్రులకు జరిగిందంతా వివరించగా.. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని సేలం నగరం సూరమంగళం సమీపంలో జరిగింది.
నిందితుల్లో ఒకరైన కె వినీత్ అలియాస్ అజర్ (23) అనే వ్యక్తికి బాధిత బాలిక తెలుసు. కొద్ది రోజుల క్రితం బాలికకు మాయమాటలు చెప్పి అపహరించిన అజర్.. తన సోదరుడైన విఘ్నేష్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అన్నదమ్ములు, స్నేహితులు ఎస్ శ్రీనివాసన్ (23), ఎస్ ఆకాష్ (20), ఎస్ అరుణ్ కుమార్ (28) కలిసి బాలికపై పలుమార్లు అత్యాచారం చేశారు. అదంతా తమ ఫోన్ లో రికార్డ్ చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియో బయటపెడతామని బెదిరించారు. అనంతరం బాలికను ఇంటికి పంపారు.
ఇంటికి వెళ్లిన బాలిక.. జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించింది. శనివారం (ఏప్రిల్ 29) సాయంత్రం బాలిక తండ్రి సూరమంగళం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ప్రధాన నిందితుడు వినీత్ ముస్లిం మహిళను వివాహం చేసుకోవడానికి రెండేళ్ల క్రితం ఇస్లాం మతంలోకి మారినట్లు గుర్తించారు. అతనితో పాటు మిగిలిన నలుగురిని విచారించగా.. అత్యాచారం చేసినట్లు అంగీకరించడంతో వారిపై పోక్సో చట్టం, ఐటీ చట్టంతో పాటు ఐపీసీ 359, 362 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీ కింద సేలం సెంట్రల్ జైలులో ఉంచారు.