పోర్న్ వీడియోల ఎఫెక్ట్.. పక్కింటి బాలికపై అత్యాచారం, ఆపై హత్య
భయపడిన యువకుడు తన వద్దనున్న చిన్న టవల్ తో బాలిక గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ఎవరికీ
గంటల తరబడి పోర్న్ వీడియోలు చూసేందుకు అలవాటు పడిన ఓ యువకుడు.. తన పక్కింటి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై ఆమె హతమార్చి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ పట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 17 ఏళ్ల యువకుడు గంటల తరబడి పోర్న్ వీడియోలు చూశాడు. ఆ తర్వాత తన పక్కింట్లో ఉండే పదేళ్ల బాలికను ఇంటిపైకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని బాలిక తన ఇంట్లో వారికి చెబుతుందేమోనని భయపడిన యువకుడు తన వద్దనున్న చిన్న టవల్ తో బాలిక గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా.. వాళ్లింట్లోనే ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. బాలికకు తాడు బిగించి, ఉరి వేసుకున్నట్లు వేలాడదీసి, ఆమె కాళ్ల వద్ద ఓ కుర్చీ ఉంచాడు.
హత్యాచారానికి గురైన బాలికకు ఏడాది వయసున్న చెల్లెలు ఉంది. ఆ పాపను ఆమె మృతదేహం వద్దే ఉంచాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఘటన జరిగిన సమయంలో బాలిక తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్లారు. తర్వాత పని నుంచి ఇంటికొచ్చిన బాలిక తల్లిదండ్రులు.. అక్కడి ఘటన చూసి షాకయ్యారు. గుండెలవిసేలా రోధించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
బాలిక ఉరికి వేలాడుతున్న తీరుచూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. బాలిక అంత ఎత్తుకు తాడు బిగించి ఉరి వేసుకునే అవకాశం లేదని అర్థమైంది. ఎవరో బాలికను హత్య చేశారని నిర్థారించుకున్నారు. పోస్టుమార్టమ్ తర్వాత పాప అత్యాచారానికి గురైనట్లు తేలింది. అన్ని కోణాల్లో విచారణ జరిపిన అనంతరం.. నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. బాలికను ఎలా హత్యచేశాడో వివరించాడు. అతడిని అరెస్ట్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.