నేడు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పై విచారణ
ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. ఆ
ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. ఆయన తల్లి మరణించించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా బెయిల్ పిటిషన్ ను కుటుంబ సభ్యులు వేయనున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయన కేసు విషయంలో పోలీసులు ఛార్జిషీటు ఇంత వరకూ వేయలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తల్లి మరణంతో....
ఆయన తల్లి మరణించడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతిని కోరుతూ కుటుంబ సభ్యులు బెయిల్ పిటీషన్ ను ప్రత్యేకంగా వేయనున్నారు. అనంతబాబు ఈ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలుకు వెళ్లి 90 రోజులకు పైగానే అయింది. దీంతో ఈరోజు బెయిల్ వస్తుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు.